కామన్స్: మొదటి అడుగులు
వికీమీడియా కామన్స్ అంటే ఏమిటి?
వేలకోట్ల ఫైళ్ళతో,వికీమీడియా కామన్స్ మీడియా ఫైళ్ళ యొక్క అతిపెద్ద ఆన్‌లైన్ రిపోజిటరీలలో ఒకటి.వేలాదిమ౦ది స్వచ్ఛ౦ద సేవకులు పంచుకున్న పనుల ను౦డి నిర్మించబడింది కామన్స్ వికీపీడియా మరియు లాభాపేక్ష లేని వికీమీడియా ఫౌండేషన్ యొక్క ఇతర పధకాలు ఉపయోగించే విద్యా చిత్రాలు, వీడియోలు, మరియు ఆడియో ఫైళ్లను కామన్స్ హోస్ట్ చేస్తుంది.కామన్స్ లో అన్ని రచనలు ,పనులు “ఉచిత లైసెన్స్” క్రింద ఉన్నాయి. అనగా లైసెన్స్ నిబంధనలను పాటించడం ద్వారా, వీటిని ఉచితంగా ఉపయోగించవచ్చు మరియు పంచుకోవచ్చు. సాధారణంగా రచయితకు క్రెడిట్ ఇవ్వడం ద్వారా మరియు లైసెన్స్ ను సంరక్షించడం ద్వారా ఇతరులు కూడా పనిని తిరిగి పంచుకోవచ్చు.
వికీమీడియా కామన్స్‌కు ఎందుకు సహకరించాలి?
ప్రతి ఒక్క మనిషీ సమస్త జ్ఞాన మొత్తాల్లో స్వేచ్ఛగా పాలుపంచుకోగల ప్రపంచాన్ని ఊహించుకోండి.మీ తోడ్పాటు అందులో భాగం కావచ్చు. మీరు మీ ఫోటోలను మరియు ఇతర ఫైళ్లను కామన్స్ లో పంచుకున్నప్పుడు మరియు వారితో వికీపీడియా వ్యాసాలను విశదీకరించినప్పుడు. మీ పనిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేలమంది వీక్షించే అవకాశముంది వందల వేల మంది ప్రజలు చూడవచ్చు.మరియు మరింత విస్తృత ప్రేక్షకులకు చేరుకునే ఒక సాధారణ వనరులను నిర్మించడానికి మీరు సహాయం చేస్తున్నారు మీడియా కామన్స్ నుండి విద్యా వెబ్ సైట్లు, వార్తా మాధ్యమాలు, బ్లాగర్లు, కళాకారులు, చిత్ర నిర్మాతలు, విద్యార్ధులు, ఉపాధ్యాయులు, ఇంకా అనేక మంది ఉపయోగిస్తున్నారు.